Friday, March 25, 2011

మరికొన్ని ఆణిముత్యాలు.


స్వధర్మపాలన చేయకుండా వ్యక్తి జీవించలేడనేది ఒక నియమము. కాని ఆ విధులే వ్యక్తిని బానిసగా చేస్తాయన్నది నిజం.సామర్థ్యంతో, నిపుణతతో బాధ్యతలు నెరవేరిస్తే, అప్పుడా బాధ్యతలు ఆ వ్యక్తిని కట్టివేయవు. ప్రేమతో నిర్వహించు కార్యాలు, విధి నిర్వహణలు మోక్షానికి దారి తీస్తాయి. విధి నిర్వహణ చాలా ముఖ్యమైనది. కాని దానికన్నా ముఖ్యమైనది ప్రేమ. అది లేకపోతే బాధ్యత బంధాలను ఏర్పరుస్తుంది. ఇతరులకు నిస్వార్ధమైన సేవలందించి ఈ మాయ అనే రొంపిని దాటడం తెలుసుకున్నవాడు అదృష్టవంతుడు.

మానవుడు తన జీవిత లక్ష్యాన్ని ఎప్పుడు జ్ఞప్తిలో సదా ఉంచుకొని ఆ లక్ష్య సిద్ధి కొరకు తన చర్యలను నిర్దేసిస్తాడో, అటువంటి వానికి చెయ్యలేనెదేదీ లేదు. ఎవరికైతే జీవిత లక్ష్యం జ్ఞప్తికి ఉండదో, వారు దుఃఖాలన్న సుడిగుండంలో సులభంగా చిక్కుకొని పోతారు.

జీవన గమ్యం "పరిపూర్ణత". కాని మానవ ప్రయత్నాలు కొన్ని హద్దుల వరకే పని చేస్తాయి. కేవలం మానవ ప్రయత్నం ద్వారా సంతోషం కలగదు కాని, దైవానుగ్రహం ద్వారా వస్తుంది. భగవంతుడు, గురువు ఈ ఇద్దరి అనుగ్రహం ఉన్నవారు ధన్యులు.

గురువు
ఉపాధ్యాయుని కన్నా భిన్నమైన వాడు గురువు. గురు(వు) అనేది "గు", "రు" అన్న రెండు మాటల కలయిక వలన ఏర్పడింది. "గు" - అంటే ’చీకటి’, "రు" - అంటే ’వెలుగు’. అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టేదానిని గురు అంటాము. పాశ్చాత్యదేశాలలో గురు అనే మాట తరచూ తప్పుగా వాడబడుతుంది. భారతదేశంలో ఈ మాట భక్తి హౌరవాలతోను, పవిత్రత, ఉన్నతమైన జ్ఞానంతోను జత చేయబడి ఉంటుమ్ది. అది ఒక పవిత్రమైన పదం. ఈ పదాన్ని ఒక్కటే వాడడం సామాన్యంగా జరగదు. ’దేవ’ తో కలిపి దీనిని ఉపయోగిస్తారు. ’దేవ’ - అంటే "ప్రకాశవంతమైన జీవి". జ్ఞానమును పొందిన గురువు లేక ఉపాధ్యాయుడు గురుదేవుడని పిలువబడతాడు.
ఎవరైతే నీ దగ్గరకు వచ్చి "నన్ను సేవించు" అని ఆజ్ఞాపిస్తారో, అలాంటి వారినెవ్వరినీ ఎప్పుడూ నమ్మకండి. ఏసుక్రీస్తు, బుద్ధుడు కూడా అలాగ అడగలేదు. గురువవడం లక్ష్యం కాదన్న విషయం ఎప్పుడూ మరిచిపోవద్దు. గురువు నది దాటడానికి ఒక పడవ లాంటి వాడు. ఒక మంచి పడవ ఉండడం చాలా ముఖ్యం కాని కారుతున్న పడవ ఉండడం చాల ప్రమాదకరం. నిస్సందేహంగా మీరు పడవను ఆరాధించరు కనుక మీరు నది దాటిన తరువాత పడవను పట్టుకొని వ్రేలాడ వలసిన అవసరం ఉండదు.
మూఢభక్తి కలవారు గురువుని ఆరాధించాలనుకుంటారు. గురువు నీ ప్రేమను, గౌరవాన్ని అందుకోవాలి. దనికీ, ఆరాధనకి తెడా ఉంది. ఒకవేళ నా గురువు, భగవంతుడు ఇద్దరూ కలసి వస్తే నేను మూమ్దుగా నా గురువు దగ్గరకి వెళ్ళి "మీకు చాల్ కృతజ్ఙుడిని. మీరు భగవంతుడిని నాకు పరిచయం చేసేరు" అని అంటాను. అంతేకాని నేను భగవంతుడి దగ్గరకు వెళ్ళి "మీకు కృతజ్ఞుడిని. మీరు నాకు గురువు గారిని ప్రసాదించేరు" అని అనను.

Thursday, March 24, 2011

ఒకటి


గణితంలో ఒకటి అన్న అంకె ఉంది. తక్కిన అంకెలన్నీ ఈ ఒకటి  యొక్క గుణిజాలే. అలాగే సంపూర్ణ సత్యం ఒక్కటే.జగత్తు యొక్క అన్ని పేర్లు, అన్ని రూపాలు ఆ ఒక్క సంపూర్ణ సత్యాన్ని స్పష్టపరిచే అనేక గుణాలు మాత్రమే.


అంతర్‌జ్ఙానము

మానవ మేధస్సు ఎంత వరకు అందుకోగలదో చూసేక దాని కతీతమైన శక్తి ఉన్నదని గ్రహిస్తాము.ఒక స్థితి చేరేకమేధస్సు మనకిక దారి చూపలేదు. అంతర్‌జ్ఙానమే మనలకిక దారి చూప గలదు.బుద్ధి పరీక్షిస్తుంది, లెక్కలేస్తుంది, నిర్ణయిస్తుంది,అంగీకరిస్తుంది (మరియు) మనసు లోపలజరిగే దానినంతటినీ నిరాకరిస్తుంది. కాని అంతర్‌జ్ఙానము లోతైన అంతరాళాలలో దాని మూలము నుండి, దానంతటాదే ప్రారంభమయే ఎటువంటి అవరోధాలు లేనిఒక ధార. ఎప్పుడైతే మనసు శాంతమైన, సమానత్వమైన, నిర్వికారమైన స్థితికిచేరుతుందో  అప్పుడే ఇది ప్రారంభమవుతుంది. వ్యక్తి అన్నింటినీతేట తెల్లంగా చూడడం పొరారంభించేటట్లుగా ఆ పవిత్రమైన అంతర్‌జ్ఙానము మానవ చైతన్యాన్ని విస్తరింపజేస్తుంది. అజ్ఙానము తొలగి, సంపూర్ణమైన జీవితం తెలుసుకొనబడుతుంది. అనేక అనుభవాల పిమ్మట స్వానుభవము మార్గదర్శీయి ఎటువంటి ప్రయత్నము లేకుండ వ్యక్తి అంతర్‌జ్ఙానాన్ని పొందడం ప్రారంభిస్తాడు.