Sunday, July 23, 2017

http://www.andhrajyothy.com/artical?SID=442012⁠⁠⁠⁠

Sunday, January 29, 2017

గుండె గొంతులోన కొట్లాడుతాది

గుండె గొంతులోన కొట్లాడుతాది అంటే ఏమిటో అనుకున్నా కాని, ఈ గుండె చూపించే ఆత్రుతకు అది అద్దం పడుతోందని తెలుసుకున్న వేళ.
ఒక వ్యక్తిని అదీ గత 40 ఏళ్ళుగా చూడని వ్యక్తిని చూడాలని ఇంత తాపత్రయం ఉంటుంది అని ఎవరయినా అంటే ఏదో బుస్సుకొడుతున్నాడులే అనుకునేవాడినేమో. చికాగోలో కలవగానే హాయ్ అని చెప్పి చెయ్యి కలుపుదాము అనుకుంటూ ముందుకెళ్తే, తెలియకుండానే గుండె ముందుకొచ్చి హత్తేసుకుంది. మనసంతా ఆనందంతో నిండిపోయింది. ఇదంతా ఏంటా అనుకుంటున్నారా? పోయిన వారం బాల్య మిత్రులం కాశీ, సీకేపీ, పీయెస్పీ, నేను చికాగో లో కలిశాము. పీయెస్పీ సంగతే చెప్తూంట. మిగిలిన వాళ్ళం అప్పుడప్పుడూ కలుస్తూ ఉన్నాము కాని వీడిని చూసి 40 ఏళ్ళు దాటింది. దాదాపు పెద్దవాడయ్యాక ఇదే చూడటం అనుకుంటా. అయినా కూడా ఎక్కడా కొత్త అనిపించనేలేదు. వాడు మీకోసం బెల్టులు తీసుకొచ్చానంటే ముగ్గురం కూడా అదేదో మా హక్కన్నట్లు దడదడా తీసేసుకోవడమే కాక వెంటనే పెట్టేసుకున్నాం. :)
ఆ మూడు రోజులూ ఎక్కడ తిరిగామో ఏమి చేశామో కూడా తెలీనట్లు గడిచిపోయింది.. కలిసి గడపడం అంతే. ఎక్కడ, ఎలా అన్నది విషయం కానే కాదు.. శనివారం నారాయణ గారిని కూడా తీసుకొని తెగ బలాదూర్ తిరిగేశాము.. అర్థరాత్రి దాటెదాక కబుర్లు చెప్పుకొని వాళ్ళిద్దరూ ఒక గది, నాది వేరే గది నిద్రలోకి జారుకున్నాం... తెల్లవారుఝామున ఎవో మాటలు వినిపించి మెలకువ వచ్చింది, తీరా చూస్తే వీళ్ళు కబుర్లు చెప్పేసుకుంటున్నారు. గబగబా వెళ్ళి నేను కూడా దూరిపోయా... మళ్ళీ కబుర్లు... :). తర్వాత పీయస్పీ చెప్పాడు. తను మామూలుగా 9:30కే పడుకుండిపోతాడంట.. అలాంటిది రోజూ 12 దాటాలిసిందే... సీకేపీ ఆతిథ్యం కూడా అద్భుతం. అలైనా, దియా చక్కగా ఉన్నారు. లేచేసరికి శైలజ గారు టిఫినుతో రడీ.. రెండు క్షణాల్లో తిరిగి వెళ్ళాలిసిన రోజు వచ్చేసింది. చికాగోలోనే ఉన్న మా చిన్ని దగ్గరకు కూడా వెళ్ళనేలేదు. ఆఖరి నిమిషం దాక సమయాన్ని పిండుకున్నాము...
బాల్య జ్ఙాపకాల మహిమ అనుకుంటా. అందుకే మరి. బాల్యమే కాదు, బాల్య జ్ఙాపకాలు కూడా అద్భుతమే కాశీ గాడికి (వాడు GM ఔగాక మాకు మాత్రం కాశీ గాడే),  అంత చక్కటి ఆతిథ్యమిచ్చిన సీకేపీ గాడికి అనేకానేక మప్పిదాలు.. అయినా మనలో మనం చెప్పుకోవడం ఏంటి.. హక్కుగా గుంజుకోవడమే..
మళ్ళీ ఇలాంటి మధుర క్షణాలకోసం ఎదురు చూస్తూ..
:)

Saturday, August 13, 2016

వేటూరి గారి Breathless

అలా మన వలలో తిరుగుతూంటే ఒక అద్భుతం కనపడింది. మీతో పంచుకుందామని ఆ లంకె ఇక్కడ ఇస్తున్నాను..
http://veturi.in/811

వేటూరి గారికి పొరలు దండాలు పెట్టాలనిపిస్తోంది అది చదివాక...
మీరేమంటారు?

:)


Wednesday, April 13, 2016

ఆవకాయ పచ్చడి

ఎండలొచ్చాయి అంటే వేడి గాడ్పులు వచ్చాయి చెమటలు వచ్చాయి అనుకుంటే నీరసం వస్తుంది కదా.. అదే మామిడికాయల సమయం వచ్చేసింది అనుకుంటే ఏదో ఉత్సాహం వచ్చేస్తుందిగా.. మరి మామిడికాయలొచ్చాయంటే వెంటనే గుర్తుకొచ్చేది ఆవకాయ పచ్చడి...
మన అమ్మమ్మల, నానమ్మల ఆవకాయ పచ్చడి ఎలా చెయ్యాలో తెలుసుకుందామా?
ఇంకేం, కింద ఉన్న లింకు నొక్కడమే...

https://youtu.be/wZjmN_ebhPI

ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండేం... 

Monday, December 29, 2014

కురుక్షేత్ర మహా యుద్ధం




కురుక్షేత్ర యుద్దంలో 18 అక్షౌహిణుల సైన్యం పాల్గొందని చదివాము కదా.. మరి అక్షౌహిణి అంటే మన లెక్కలో ఎంత అన్నది ఒకసారి చూద్దామా...
ఒక రథం, ఒక ఏనుగు, 3 గుర్రాలు, 5గురు సైనికులు (కాలి బంట్లు) కలిపి పత్తి అంటారు.
3 x పత్తి = సేనాముఖం
3 x సేనాముఖం = గుల్మం
3 x గుల్మం = గణం
3 x గణం = వాహిని
3 x వాహిని = పృతన
3 x పృతన = చమువు
3 x చమువు = అనీకిని
10 x అనీకిని = అక్షౌహిణి

మరి లెక్క పూర్తి చేసి చూద్దామా ?
1 అక్షౌహిణి =
21870 రథాలు
21870 ఏనుగులు
65610 గుర్రాలు
109350 సైనికులు

ఈ మొత్తం 1 అక్షౌహిణి. కాని కురుక్షేత్ర యుద్దంలో 18 అక్షౌహిణిలు పాల్గొన్నాయి. కాబట్టి 18తో హెచ్చవేయండి. నాకు కళ్ళు తిరుగుతున్నాయి... :)
-తెలుగు వెలుగు నుంచి..
http://ramojifoundation.org/flipbook/201410/magazine.html#/10

Wednesday, August 20, 2014

జూన్ 29న డిట్రాయిట్ నగరంలో జరిగిన పాడుతా తీయగా గురించి...

పాడుతా తీయగా అంటూ తెలుగు ప్రజల గుండె గూటిలో పక్క వేసుకొని పక్కాగా స్థిరపడిపోయిన మన గాన గంధర్వుడు బాలు ముఖ్య అతిథి, మధురగాయకుడు మనో తో కలిసి  pre finals కోసం డిట్రాయిట్ వచ్చారు. ఇక డిట్రాయిట్ తెలుగు వారంతా వింటాం వీనుల విందుగా బల్ పసందుగా అంటూ కుటుంబాలతో ఈ  కార్యక్రమం జరుగుతున్న Ford Community and Performing Arts Center కు తరలి వచ్చారు.  మూడు సంచికలుగా జరిగిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా ఉల్లాసంగా జరిగింది. ఇందులో నిఖిత, సుమేథ, శ్రీవిష్ణుప్రియ, స్నేహ, మేఘన పాల్గొని బాలగంధర్వులనిపించేలా వారు పాడిన పాటలు అందరినీ మంత్రముగ్ధులను చేశాయి. మొదటి సంచికలో మధ్య కాల మాధుర్యాలు (mid melodies), రెండవ సంచికలో సినిమాలలో రాని అన్నమయ్య కీర్తనలు, ఆఖరి సంచికలో సినిమా పాటలు విషయాలుగా ఉన్నాయి. 

మొదటి సంచిక ఆరంభంలో నాట్స్ అధ్యక్షులు శ్రీ గంగాధర్ దేసు గారు  మాట్లాడుతూ నాట్స్ కార్యక్రమాలను, వివిధ సందర్భాలలో ఉత్తర అమెరికాలోని తెలుగువారికి నాట్స్ చేసిన సేవలను  వివరించారు. 
రెండవ సంచిక చివరలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరగటానికి సహకరించిన sponsors here అందరికీ బాలు ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీ గంగాధర్ గారు DTA కార్యవర్గ సభ్యులను సభకు పరిచయం చేసి ధన్యవాదాలు తెలియజేశారు. 
ప్రతి సంచికను ప్రారంభించేముందు బాలు స్థల పురాణంగా డిట్రాయిట్ గురించి, ముఖ్య అతిథి మనో గారి గురించి వివరించారు.  తను 1977-78 లో మొదటిసారి డిట్రాయిట్ వచ్చినప్పుదు ఇదే హాలులో సుశీలమ్మ గారితో కలిసి తన కచేరీ జరిగిన విషయాన్ని తలచుకున్నారు.  
అమెరికాలో పుట్టిపెరిగిన ఈ పిల్లలు ఇంత స్వచ్చంగా ఉచ్చారణ దోషాలు లేకుండా పాడటం బాలు గారిని ఎంతగానో ఆకట్టుకుంది. ప్రతి పాట తరువాత బాలు గారు ఆ పాటలోని బాగోగులను వివరించిన తీరు, పిల్లలకు మార్గదర్శనం చేసిన విధం అందరినీ ఆకట్టుకుంది. పాడుతా తీయగా కార్యక్రమం భావి గాయకులకు ఇంత స్ఫూర్తిదాయకంగా ఎందుకు ఉందో ప్రత్యక్షంగా తిలకించే భాగ్యం మా డిట్రాయిట్ వాసులకు కలిగిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 
పాడటానికి వచ్చిన పిల్లలందరినీ చప్పట్లతో స్వాగతం పలికారు. ముఖ్యంగా స్థానికురాలు సుమేథ పాడటానికి రాగానే హాలు దద్దరిల్లిపోయింది.
ఈ మూడు సంచికలలో పాడిన పాటలకు వచ్చిన మార్కుల సగటు ఆధారంగా సుమేథ మినహా మిగతా నలుగురు finals కు వెళ్ళారు. 
ఈ prefinals లో బయటకు వెళ్ళాల్సి వచ్చిన సుమేథకు నాట్స్ తరఫున శ్రీ గౌతం మార్నేని, శ్రీ కొడాలి కిషోర్ గార్లు 500డాలర్ల చెక్కును బహూకరించారు. 
తర్వాత నాట్స్ జాతీయ సెక్రటరి శ్రీ బసవేంద్ర సూరపనేని గారు తన సహచరులు కృష్ణ కొత్తపల్లి, గౌతం మార్నేని, కిషోర్ కొడాలి,  శ్రీని కొడాలి, శేఖర్ దేవరసెట్టి, భాస్కర్ వారణాసి, శివ అడుసుమిల్లి, కృష్ణ నిచ్చెనమెట్ల, సుభాష్ రౌతు, నాగేంద్ర కొలిపాక గార్లను సభకు పరిచయం చేశారు. బాలు గారి స్వస్తి వాచకాలతో చివరి సంచిక ముగిసింది