గుండె గొంతులోన కొట్లాడుతాది అంటే ఏమిటో అనుకున్నా కాని, ఈ గుండె చూపించే ఆత్రుతకు అది అద్దం పడుతోందని తెలుసుకున్న వేళ.
ఒక వ్యక్తిని అదీ గత 40 ఏళ్ళుగా చూడని వ్యక్తిని చూడాలని ఇంత తాపత్రయం ఉంటుంది అని ఎవరయినా అంటే ఏదో బుస్సుకొడుతున్నాడులే అనుకునేవాడినేమో. చికాగోలో కలవగానే హాయ్ అని చెప్పి చెయ్యి కలుపుదాము అనుకుంటూ ముందుకెళ్తే, తెలియకుండానే గుండె ముందుకొచ్చి హత్తేసుకుంది. మనసంతా ఆనందంతో నిండిపోయింది. ఇదంతా ఏంటా అనుకుంటున్నారా? పోయిన వారం బాల్య మిత్రులం కాశీ, సీకేపీ, పీయెస్పీ, నేను చికాగో లో కలిశాము. పీయెస్పీ సంగతే చెప్తూంట. మిగిలిన వాళ్ళం అప్పుడప్పుడూ కలుస్తూ ఉన్నాము కాని వీడిని చూసి 40 ఏళ్ళు దాటింది. దాదాపు పెద్దవాడయ్యాక ఇదే చూడటం అనుకుంటా. అయినా కూడా ఎక్కడా కొత్త అనిపించనేలేదు. వాడు మీకోసం బెల్టులు తీసుకొచ్చానంటే ముగ్గురం కూడా అదేదో మా హక్కన్నట్లు దడదడా తీసేసుకోవడమే కాక వెంటనే పెట్టేసుకున్నాం. :)
ఆ మూడు రోజులూ ఎక్కడ తిరిగామో ఏమి చేశామో కూడా తెలీనట్లు గడిచిపోయింది.. కలిసి గడపడం అంతే. ఎక్కడ, ఎలా అన్నది విషయం కానే కాదు.. శనివారం నారాయణ గారిని కూడా తీసుకొని తెగ బలాదూర్ తిరిగేశాము.. అర్థరాత్రి దాటెదాక కబుర్లు చెప్పుకొని వాళ్ళిద్దరూ ఒక గది, నాది వేరే గది నిద్రలోకి జారుకున్నాం... తెల్లవారుఝామున ఎవో మాటలు వినిపించి మెలకువ వచ్చింది, తీరా చూస్తే వీళ్ళు కబుర్లు చెప్పేసుకుంటున్నారు. గబగబా వెళ్ళి నేను కూడా దూరిపోయా... మళ్ళీ కబుర్లు... :). తర్వాత పీయస్పీ చెప్పాడు. తను మామూలుగా 9:30కే పడుకుండిపోతాడంట.. అలాంటిది రోజూ 12 దాటాలిసిందే... సీకేపీ ఆతిథ్యం కూడా అద్భుతం. అలైనా, దియా చక్కగా ఉన్నారు. లేచేసరికి శైలజ గారు టిఫినుతో రడీ.. రెండు క్షణాల్లో తిరిగి వెళ్ళాలిసిన రోజు వచ్చేసింది. చికాగోలోనే ఉన్న మా చిన్ని దగ్గరకు కూడా వెళ్ళనేలేదు. ఆఖరి నిమిషం దాక సమయాన్ని పిండుకున్నాము...
బాల్య జ్ఙాపకాల మహిమ అనుకుంటా. అందుకే మరి. బాల్యమే కాదు, బాల్య జ్ఙాపకాలు కూడా అద్భుతమే కాశీ గాడికి (వాడు GM ఔగాక మాకు మాత్రం కాశీ గాడే), అంత చక్కటి ఆతిథ్యమిచ్చిన సీకేపీ గాడికి అనేకానేక మప్పిదాలు.. అయినా మనలో మనం చెప్పుకోవడం ఏంటి.. హక్కుగా గుంజుకోవడమే..
మళ్ళీ ఇలాంటి మధుర క్షణాలకోసం ఎదురు చూస్తూ..
:)

1 comment:
Good post sir
తెలుగు డబ్బింగ్ సినిమాల సునామీ!
Please Visit Blog for All Telugu Dubbed Movies
Post a Comment