ఏ ప్రత్యేకతలూ లేని ఒక సామాన్యుడిని అని చక్కగా వినయంగా వినమ్రంగా చెప్పానని అనుకున్నాను. సరదాగా అలా నడుద్దామని బయటకు వచ్చి నడుస్తూ నడుస్తూ ఉంటే పక్కన కనిపించిన ఒక అందమయిన పచ్చిక బయల్లోకి వెళ్ళాను. (పచ్చికలోని అందాన్ని చూడడానికి అని సోగ్గా చెప్పినా, అసలు సంగతి కాళ్ళు నొప్పి పెట్టి వెళ్ళాననుకోండి). అక్కడ కనుచూపు సాగినంత మేరా పచ్చని తివాచీ లాగ పచ్చిక చాలా బాగుంది అనుకుంటూ ఉండగా కనిపించాయి అక్కడక్కడా ఉన్న గడ్డిపూలు. చాలా అందంగా అనిపించాయి.చుట్టూ ఉన్న పచ్చటి గడ్డిలో ప్రత్యేకంగా కనిపిస్తూ నా రూటు సెపరేటు అంటున్నట్లు.... సో, ఇప్పుడర్థమయింది. గడ్డిపువ్వుని అని చెప్పుకోవడం ఎంత అహంకారంగా ఉందో అని... ఇంక నా డెఫినిషన్ మార్చాలేమో. ఎందుకొచ్చిన గొడవ... హాయిగా నేనొక సామాన్యుడిని అనేస్తే పోలా